థాయిలాండ్‌లోని ముక్టాహన్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రలో భాగంగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న 35 మంది బౌద్ధ సన్యాసులపైకి అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కారు నడుపుతున్న 11 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.