షూటింగ్‌లో ప్రమాదం జరిగి కోలీవుడ్ పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. పా.రంజిత్ దర్శకతంలో ఆర్య హీరోగా తెరకెకిస్తున్న సినిమా షూటింగ్‌లో భాగంగా స్టంట్ మాస్టర్ రాజు కారుతో హై రిస్క్ స్టంట్ చేస్తుండగా కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో స్టంట్ మాస్టర్ రాజు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.