ఒడిశాలోని బాలాసోర్ జిల్లా తురిగడియా మార్కెట్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు సాహసోపేతంగా ఏటీఎం దోపిడీకి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మహీంద్రా థార్ ఎస్‌యూవీకి ఇండియా వన్ ఏటీఎం మిషన్‌ను కట్టి కియోస్క్ నుంచి బయటకు లాగి, దాదాపు 200 మీటర్ల దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. అనంతరం ఏటీఎంను పగులగొట్టి అందులోని నగదును దోచుకుని పరారయ్యారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.