LIVE VIDEO: మద్యం షాపులో బీర్లు చోరీ

యూపీలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా గొండా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జమునియా బాగ్‌లో ఉన్న మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు షాపులో ఉన్న గల్లాలో ఉన్న రూ.1.10 లక్షల నగదు, 24 బీర్లు, 7 మద్యం బాటిళ్లు అపహరించారు. సీసీటీవీలో ముఖానికి ముసుగు కట్టుకుని చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్