LIVE VIDEO: బాలుడిని ఢీకొట్టిన బైకర్

గుజరాత్‌లోని వాపి చలా ముక్తానంద్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక మోటార్ సైకిల్ రోడ్డుపై వెళ్తున్న చిన్నారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. నివాస ప్రాంతాల్లో కూడా వాహనదారులు భారీ వేగంతో వెళ్లడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్