LIVE VIDEO: రాగి గనిలో కూలిన వంతెన.. 32 మంది మృతి!

కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో రాగి గనిలో వంతెన కూలిపోవడంతో 32 మంది కార్మికులు మృతి చెందారని సమాచారం. కాల్పుల శబ్దం వినిపించడంతో కార్మికులు ఇరుకైన వంతెనపై పరుగులు తీస్తుండగా అది కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. లక్షలాది మందికి ఉపాధి ఇస్తున్న ఈ మైనింగ్‌ ప్రాంతంలో భద్రతా చర్యలు సరిగ్గా లేక గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్