మధ్యప్రదేశ్ ఖండ్వాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైకర్ గాల్లోకి ఎగిరిపడి దూరంగా పడిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరిదీ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తెలిపారు. కార్ డ్రైవర్ జనావాస ప్రాంతంలో అతివేగంగా నడపడం, బైకర్ రోడ్డు దాటే సమయంలో గమనించకపోవడం ప్రమాదానికి దారితీసింది. అదృష్టవశాత్తూ బైకర్ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.