LIVE VIDEO: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. రోహిణి ప్రాంతంలో అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి నేరుగా ఒక ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలి దగ్గరి వరకు కారు వెళ్లి ఆగింది. దాంతో ఆమె అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో వాహనంలోని వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్