TG: వరంగల్ జిల్లా వర్ధన్నపేట వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న గుగులోతు సురేష్, ఆయన కుమారుడు అభిరామ్ గాయపడ్డారు. సురేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అభిరామ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.