గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లా లూనావాడ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉస్మానియా నగర్ సొసైటీ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను, వెనుక నుండి అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళలు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన భయంకరమైన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.