యూపీలోని మొరాదాబాద్ కట్‌ఘర్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాశీపూర్ తిరాహా సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక యువతిని, రైస్ జాదోన్ వేగంగా నడుపుతున్న మహీంద్రా థార్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆమె రోడ్డుపై పడిపోగా, దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయగా, నిందితుడిపై తదుపరి చర్యల కోసం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.