మహారాష్ట్రలోని నాసిక్‌లో బుధవారం విషాద ఘటన జరిగింది. అక్కడి ఓ ప్రముఖ హోటల్ పార్కింగ్ ఏరియాలో కారు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. హోటల్‌లోకి కారు వస్తుండగా.. బాలుడు ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ రావడంతో కారు ఢీకొట్టింది. గమనించిన తండ్రి బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో నెట్టింట వైరల్ అవుతోంది.