LIVE VIDEO: భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం

మహారాష్ట్రలోని హింగోలిలో భూకంపం సంభవించింది. అక్కడి మల్ధామణి గ్రామంలో భూకంపం రావడంతో స్థానిక ప్రజలు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం బుధవారం ఉదయం 7.14 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం నమోదు అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్