ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో దారుణం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న సోహిల్(18)ను, పాత కక్షల నేపథ్యంలో అతని స్నేహితుడే నీటిలో ముంచి హత్య చేశాడు. బాధితుడు ఎంత ప్రయత్నించినా నిందితుడు వదల్లేదు. సుమారు 2 నిమిషాల తర్వాత వదిలేసి నిందితుడు పరారయ్యాడు. అప్పటికే సోహిల్ ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.