LIVE VIDEO: జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ

మహారాష్ట్రలోని నాసిక్‌లో జ్యువెలరీ షాప్‌లో చోరీ జరిగింది. జత్రా హోటల్ ప్రాంతంలోని ఆర్య జ్యువెలర్స్‌కు కస్టమర్లుగా వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 2.5 తులాల బరువున్న బంగారు ఉంగరాల ట్రేను ఎత్తుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన షాపు యజమాని, సిబ్బంది దొంగలను వెంబడించినప్పటికీ, బయట సిద్ధంగా ఉంచిన కారులో వారు పరారయ్యారు. ఈ ఘటన షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్న అడ్గావ్ పోలీసులు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕