రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో భారీ చోరీ జరిగింది. టోంక్ రోడ్డులోని ‘రాడో’ లగ్జరీ వాచ్ షోరూమ్‌లోకి గురువారం తెల్లవారుజామున దుండగులు చొరబడ్డారు. ఐరన్ రాడ్‌తో షట్టర్‌ను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు.. కేవలం కొద్ది నిమిషాల్లోనే షోకేసుల్లోని కోట్లాది రూపాయల విలువైన ప్రీమియం వాచీలను సంచుల్లో నింపుకుని పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.