ఆస్ట్రేలియాలో లాంచ్ చేసిన 14 సెకన్లలోనే రాకెట్ కుప్పకూలింది. 23 మీటర్ల ఎరిస్ లాంఛ్ వెహికల్ లిఫ్ట్ ఆఫ్ సమయంలో ఎగరలేక నేలపై కూలింది. భారీగా మంటలు చెలరేగడంతో కాలిపోయింది. నార్తర్న్ క్వీన్స్‌లాండ్లోని బోవెన్ స్పేస్ పోర్ట్ నుంచి దీన్ని ప్రయోగించారు. తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రాకెట్ తయారు చేయగా.. రాకెట్ తయారీ సంస్థ 'గిల్మౌర్' సీఈవో ఈ ప్రయోగాన్ని మైల్‌స్టోన్‌గా అభివర్ణిస్తూ, ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం.