TG: సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగరాజు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.