LIVE VIDEO: మెట్రోలో యువతిని పొడిచి చంపిన యువకుడు

మెట్రోలో వెళ్తున్న ఓ యువతిని ఒక వ్యక్తి మూడుసార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగు చూసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి తప్పించుకుని US వచ్చిన ఇరినా (30) అనే యువతిని చార్లెట్ నగరంలో డికార్లోస్ బ్రౌన్ అనే వ్యక్తి దారుణంగా చంపేశాడు. బ్రౌన్ తన జేబులోంచి కత్తి తీసి, పొడిచినట్లు సీసీటీవీల్లో రికార్డయింది.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  హత్యకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్