ప్రపంచవ్యాప్తంగా కాలేయ క్యాన్సర్ కేసుల్లో 60% వరకు ముందస్తు జాగ్రత్తలతో నివారించవచ్చని లాన్సెట్ కమిషన్‌కు సమర్పించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల అధ్యయనం స్పష్టం చేసింది. హెపటైటిస్ టీకాలు, మద్యపానం నివారణ, మధుమేహం-స్థూలకాయం నియంత్రణతో ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చంది. కాలేయంలో కొవ్వు పేరుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం 35% పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. 2040 నాటికి ఈ వ్యాధి కేసులు 55% పెరిగే అవకాశముందంది.