కాలేయ సమస్యలకు మూత్రం రంగు మార్పు సంకేతమా?

మూత్రం రంగు మారడం కాలేయ వ్యాధులకు సంకేతం కావచ్చని వైద్యులు వివరిస్తున్నారు. డీహైడ్రేషన్, విటమిన్ B12 సప్లిమెంటేషన్ వల్ల మూత్రం పసుపు రంగులోకి మారవచ్చంటున్నారు. అయితే, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల్లో కాలేయం బిలిరుబిన్‌ను సరిగ్గా ప్రాసెస్ చేయలేక, అది శరీరంలో పేరుకుపోవడం వల్ల మూత్రం ముదురు పసుపు, టీ రంగులోకి మారుతుందంటున్నారు. కామెర్లు, అలసట, లేత రంగు మలం వంటి లక్షణాలతో పాటు ఈ మార్పు కనిపిస్తే, అది కాలేయ నష్టానికి స్పష్టమైన సంకేతమంటున్నారు. దీనిని తేలికగా తీసుకోకూడదని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్