నేడు కరీంనగర్‌లో పశువుల బీమా పథకం ప్రారంభం

TG: కరీంనగర్‌లో పశువుల బీమా పథకం ప్రారంభం కానుంది. పాడిగేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల బీమా పథకానికి శనివారం ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి శ్రీహరి ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో మహబూబ్​నగర్ తర్వాత కరీంనగర్లోనే అత్యధికంగా గొర్రెలు, మేకలు ఉండటంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕