TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల ఆదరణ పొందేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమాయత్తం చేయాలని పార్టీ ముఖ్య నేతలకు BRS చీఫ్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గత వారం రోజులుగా పార్టీ సీనియర్లతో సాగిన చర్చల్లో నదీజలాల పంపిణీ, సాగునీరు, రైతాంగం సమస్యల దృష్టి సారించిన కేసీఆర్.. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పకడ్బందీ పోరాట కార్యాచరణ కోసం వ్యూహాలు, ఎత్తుగడలను సిద్దం చేశారని సమాచారం.