స్థానిక ఎన్నికలు.. హైకోర్టు తీర్పు తర్వాతే సర్కార్ నిర్ణయం

TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో నమోదైన పిటిషన్‍పై ఈ నెల 3న హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి ఇటు బీసీ సంఘాలు అటు రాజకీయపార్టీల్లో నెలకొంది. ఎల్లుండి హైకోర్టు నిర్ణయం అధారంగా స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. నవంబర్ 7వ తేదీన మరోసారి మంత్రివర్గం సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని గత కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రి పొంగులేటి చెప్పారు.

సంబంధిత పోస్ట్