TG: రాష్ట్రంలో గతం కంటే ఈ సారి ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా 71 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో కలవడంతో దీని ప్రభావం ఎంపీటీసీ స్థానాలపై పడింది. దీంతో MPTC స్థానాల సంఖ్య 5,817 నుంచి 5,773కు తగ్గింది. ఇంద్రేశం, జిన్నారం, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. అటు గ్రామపంచాయతీలు 12,760 కానుండగా వార్డుల సంఖ్య 1,12,500కు చేరింది. మరోవైపు MPPలు, ZPTCల స్థానాల సంఖ్య 566గా ఉంది. జిల్లా పరిషత్లు 31గా ఉన్నాయి.