ఉత్తరప్రదేశ్ లక్నోలోని వికాస్‌నగర్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వందలాది కుటుంబాలకు స్థానికులు అండగా నిలిచారు. ప్రభుత్వం, అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోని సమయంలో, మానవత్వం చాటుతూ కొందరు తమవంతు సహాయం అందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం సిగ్గుచేటని, బాధితులను వెంటనే ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.