జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో బీజ్‌బెహారా సమీపంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఒక గద్ద వేగంగా వచ్చి రైలు ఇంజిన్ ముందు అద్దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకో పైలట్ విశాల్ స్వల్ప గాయాలపాలయ్యారు. ఆయనకు అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్‌లో తక్షణ వైద్యం అందించారు. తనిఖీ అనంతరం, రైలు మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించడానికి అధికారులు అనుమతి ఇచ్చారు.