విపక్షాల నిరసనల కారణంగా లోక్‌సభను రేపటి(గురువారం)కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా బుధవారం ప్రకటించారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 13తో ముగియనున్న నేపథ్యంలో, కేంద్రం ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16, 17, 18 తేదీలలో డీలిమిటేషన్, మహిళా బిల్లులపై చర్చించేలా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.