లోకసభ సెక్రటేరియట్ డైరెక్టర్ గౌరవ్ గౌతమ్(40) నోయిడాలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సెక్టార్ 82లోని కేంద్రీయ విహార్-2 సొసైటీలో ఉంటున్న ఈయన సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గౌరవ్ గౌతమ్ భార్య తన పుట్టింటికి వెళ్లి తిరిగివచ్చేసరికి ఫ్లాట్ లాక్ చేసి ఉంది. అనుమానం వచ్చి ఆమె సెక్యూరిటీ గార్డ్ సహాయంతో లోపలికి వెళ్లి చూడగా, భర్త ఉరేసుకుని కనిపించారు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.