టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు అమెరికాలోని టీడీపీ నాయకులు ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ అంటూ స్వాగతం పలికిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అక్కడ టీడీపీ ఎన్నారైలు నారా లోకేశ్ ఫ్యూచర్ మినిస్టర్ అంటూ రాసిన భారీ స్వాగత ఫ్లెక్సీని ఆకాశంలో జెట్ విమానానికి వేలాడదీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి లోకేష్ కీలక పాత్ర పోషించారు.