ఏపీలో టీడీపీ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి లోకేశ్‌కు మాజీ మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 'లోకేశ్.. ఎర్రబుక్కు రాశావ్ కదా, ఆ ఎర్రబుక్కుకు ప్రతిఫలం నీ జీవితం. అది అనుభవించక తప్పదు. అనుభవంతో చెప్తున్నా.. ఒక్క ఫోర్ ఇయర్స్ ఆగు బ్రదర్. దీనికి మూల్యం చెల్లిస్తావ్' అని అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.