హాంకాంగ్‌లో చిక్కుకున్న తెలుగు కుటుంబం.. స్పందించిన లోకేశ్‌

హాంకాంగ్ విమానాశ్రయంలో పాస్‌పోర్ట్‌లు పోగొట్టుకుని చిక్కుకున్న తెలుగు కుటుంబానికి ఏపీ మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. హైదరాబాద్ నుంచి షికాగో వెళ్తున్న బొల్లా రాజేశ్వరి కుటుంబం 52 గంటలుగా చిన్నారులతో ఇబ్బందులు పడుతున్నామని సోషల్ మీడియాలో చేసిన విజ్ఞప్తికి స్పందించిన లోకేశ్, వెంటనే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీంతో విదేశాంగ శాఖ స్పందించి హాంకాంగ్‌లోని భారత కాన్సులేట్‌ను అప్రమత్తం చేసింది. బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా సహాయం అందిస్తామని భారత రాయబారి కార్యాలయం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్