AP: బతుకుదెరువు కోసం కువైట్ వచ్చిన తాను అష్టకష్టాలు పడుతున్నానని తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ ‘ఎక్స్’లో వీడియో పెట్టిన విషయం తెలిసిందే. తనకు సాయం చేయకపోతే చావే శరణ్యమని శివ వేడుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేశ్ శివను క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చారు. స్వస్థలం అన్నమయ్య(D) వాల్మీకిపురం(M) చింతపర్తికి చేరుకున్న శివను చూసి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.