నగరాల్లో యువతలో ‘లోన్లీనెస్’ సమస్య పెరుగుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చుట్టూ జనాలు, సోషల్ మీడియాలో వందలాది ఫ్రెండ్స్ ఉన్నా కూడా చాలామంది యువత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. భారత నగరాల్లో సుమారు 43% యువత ఈ సమస్యతో బాధపడుతుండగా, మెట్రో నగరాల్లో ఇది 60% వరకు చేరింది. బిజీ లైఫ్‌స్టైల్, ఉద్యోగ ఒత్తిడి, సోషల్ మీడియా ప్రభావం ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. నిజమైన సంబంధాలు పెంచుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని సూచిస్తున్నారు.