అనిల్‌ అంబానీపై లుకౌట్‌ నోటీసులు జారీ

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణలతో లుకౌట్ సర్క్యూలర్‌ జారీ చేసింది. రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఇప్పటికే ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 5న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అనిల్ విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు లుకౌట్ సర్క్యూలర్ జారీ చేసినట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్