TG: అయ్యప్ప మాల ధరించిన ఓ వ్యక్తి మద్యం తాగుతూ మిగతా స్వాములకు పట్టుబడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో జరిగింది. భక్తి శ్రద్ధలతో ఉండాల్సిన వ్యక్తి అన్నీ మర్చిపోయి మద్యం తాగడమేంటని తోటి స్వాములు ప్రశ్నించి మందలించారు. దీంతో అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.