లారీ, బైకు ఢీ.. ముగ్గురు యువకులు మృతి

TG: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిపేట వద్ద ఓ లారీ, బైకు రెండు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అప్రోజ్, సొహైల్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు సిద్దార్థ్ ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు .

సంబంధిత పోస్ట్

✕
✕