బ్రెజిల్‌లో లారీ, బస్సు ఢీ.. 11 మంది మృతి

బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు (మెక్సికో కాలమానం ప్రకారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారాజిన్హో సమీపంలో జాతీయ రహదారిపై ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్