TG: హైదరాబాద్ కూకట్‌పల్లి జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యంతో చెరకు లోడుతో వెళ్తున్న లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఆ సమయంలో ఇతర వాహనాలు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు క్రేన్ల సహాయంతో లారీని తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.