TG: ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరోను వెనుకనుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో ఉన్న ఇద్దరు వ్యక్తులు మల్లేశ్ (32), ఉపేందర్ (40) మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. దేవరపల్లి నుండి ఖమ్మం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.