కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ(వీడియో)

TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో సోమవారం లారీ బీభత్సం సృష్టించింది. కారును ఢీకొట్టి ఆపకుండా అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు నాలుగు కార్లలో లారీని వెంబడించారు. పాస్తాపూర్ ఫ్లైఓవర్ వద్ద అడ్డుకోబోయిన కార్లను సైతం లారీ డ్రైవర్‌ ఢీకొట్టి పరారీకి యత్నించారు. ఈ మేరకు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు జహీరాబాద్ పీఎస్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕