AP: తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామాల మధ్య ఉన్న గుర్రాల బొమ్మ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. బూరుగుపూడి వైపు నుంచి వస్తున్న గ్యాస్ లారీ, గోకవరం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.