బైకును ఢీకొట్టిన లారీ, వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మొయినాబాద్ మండలం కనకమామిడి వద్ద హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై లారీ బైకును ఢీకొనడంతో చేవెళ్ల మండలం మల్కాపూర్ వాసి రఘునాథరెడ్డి (25) మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్