AP: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన లక్ష్మి(40), కుమారుడు చంద్రశేఖర్(23) గురువారం బైక్‌పై రాజమహేంద్రవరంలోని తమ బంధువుల కుమార్తె ప్రసవించగా.. వారిని చూసేందుకు బయలుదేరారు. కంసాలిపాలెం-రావిమెట్ల వద్ద బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. తల్లీకొడుకు స్పాట్‌లో మృతి చెందారు. దాంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.