టోల్ ప్లాజా దగ్గర కారుని ఢీకొట్టిన లారీ (వీడియో)

UP, కాన్పూర్‌లోని బారా జోడ్ టోల్ ప్లాజా వద్ద షాకింగ్ ప్రమాదం జరిగింది. టోల్ దగ్గర ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన ఒక కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా, టోల్ ప్లాజా సిబ్బంది వెంబడించి పెట్రోల్ పంప్ వద్ద లారీని అడ్డుకున్నారు. అయితే, డ్రైవర్ మాత్రం అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్