సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ వ్యానును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి(వీడియో)

TG: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా - తాడ్వాయి మధ్య అటవీ శాఖ చెక్‌పోస్ట్ సమీపంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. 39 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ వ్యానును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక జవాన్ మృతిచెందారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. హన్మకొండ నుంచి ఇసుక కోసం వెళ్తున్న లారీ.. జాతీయ రహదారిపై CRPF జవాన్ వెళ్తున్న వాహనంతో పాటు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో జవాన్ చనిపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕