TG: ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఆర్టీసీ కార్గో బస్సును లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.