AP: విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బుదిరెడ్లపాలేనికి చెందిన గంగరాజు, సుజాత దంపతులకు మౌనిక అనే కుమార్తె ఉంది. ఆమెకు చదువు నిమిత్తం విశాఖలోని కాలేజీలో దింపేందుకు స్కూటీపై వెళ్లారు. ఆనందపురం వద్ద బైక్‌ని లారీ ఢీకొట్టడంతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి కళ్ల ముందే మౌనిక ప్రాణాలు విడిచింది. దాంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.