స్కూటీని ఢీకొట్టిన లారీ.. యువకుడు మృతి (వీడియో)

TG: వరంగల్ జిల్లా పున్నేలు క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లితో కలిసి స్కూటీపై వెళ్తున్న తరుణ్ అనే యువకుడిని లారీ వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో లారీ కింద పడి తరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే కొడుకు మరణించడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించారు. మృతుడు జనగామ జిల్లా సాగరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా తరుణ్ యుద్ధ భయంతో 3 రోజుల క్రితమే దుబాయ్ నుండి స్వగ్రామానికి వచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్