పెళ్లిబృందం వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ముగ్గురి దుర్మరణం

TG: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పుర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని బోర్‌వెల్స్‌ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్